Sat. Oct 24th, 2020

జిజిహెచ్‍లో అర్ధరాత్రి హైడ్రామా..!

govt hospital

govt hospital

శస్త్ర చికిత్స తీసుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఆసుపత్రిలోనే విచారించవలిసిందిగా.. ఏసిబి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ. బుధవారం అర్ధరాత్రి ఆయనను డిశ్చార్జి చేసేందుకు చేసిన ప్రయత్నాలపై మాజీ ఎమ్మెల్యేలు, టిడిపి పార్టీ నేతలు ఎదురు తిరగటంతో.. అచ్చెన్నాయుడు డిశ్చార్జి ఆగిపోయింది. ఉన్నతాధికారులు ఆదేశాలతోనే అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేశామని అధికారులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడును అర్ధరాత్రి డిశ్చార్జి చేయాల్సిన అవసరం ఏమిటి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‍ అధికారులను నిలదీశారు. దేశంలోనే కొత్త సంస్కృతిని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని మాజీ మంత్రి ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో పోలీసు అధికారుల అత్యుత్సాహంతో టిడిపి నేతలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆలపాటి అన్నారు. రెండు సార్లు ఆపరేషన్‍ చేయించుకున్న అచెచ్చన్నాయుడు పట్ల ఇంత దారుణంగా వ్యవహరించటం ఏమిటని మాజీ మంత్రి సోమిరెడ్డి నిలదీశారు.

ఈ విషయంపై మాజీ హోం మంత్రి చిన రాజప్ప స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీపై కక్ష సాధించాలన్న పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. ఆసుపత్రి ఆవరణలో పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతో టిడిపి సానుభూతిపరులు, కార్యకర్తలను బయటకు నెట్టివేశారని మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. కోర్టు ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడుని విచారించవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. మరో వైపు డిశ్చార్జి చేసి కస్టడిలోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. ఇది కోర్టు దిక్కారం కిందకు రాదా.. అని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా భయపడం.. అధికార దౌర్జన్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం. ఇంతకూ అచ్చెన్నాయుడు అరెస్టు చేయించమని అదేశాలు ఇచ్చిన అధికారు ఎవరు.? ఉన్నతాధికారుల ఆదేశాలతో సూచనలతోనే అచ్చెన్నను డిశ్చార్జి చేస్తున్నామని జిజిహెచ్‍ సూపరిండెంట్‍ చెబుతున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ప్రభుత్వమే హత్య చేయించాలనుకుంటుందా అని టిడిపి మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోర్టు తీర్పు ఉన్నప్పటికీ… శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడుని అర్దరాత్రి డిశ్చార్జి చేసేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించటం వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరెవరు ఉన్నారనే విషయం త్వరలో బయట పెడతామంటున్నారు మాజీ మంత్రులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *