Sat. Oct 24th, 2020

ఇంఛార్జి విసి పాలనలో ఆంధ్ర యూనివర్శిటీ..!

au

au

ఆంధ్ర యూనివర్శిటికి శాశ్వత వైస్‍ ఛాన్స్లర్‍ పోస్టును నియమించకుండా.. ఇంఛార్జి వైస్‍ఛాన్స్లర్‍తోనే మరలా కొనసాగిస్తున్నారు. జులై 17వ తేదీకి ఇంఛార్జి వైస్‍ ఛాన్స్లర్‍గా పివిజిడి.ప్రసాద్‍రెడ్డిను నియమించి సంవత్సరం పూర్తయింది. అంతకు ముందు విసిగా పదవీ విరమణ చేసిన నాగేశ్వరరావు స్థానంలో ఇంఛార్జి విసిగా ప్రసాద్‍రెడ్డిని నియమించిందే తప్ప పూర్తి స్థాయి విసిని ప్రభుత్వం ఇంత వరకు నియమించలేదు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‍ క్యాపిటల్‍ను పెట్టింది వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ది చేయటానికే అని.. ఉత్తరాంధ్రలో బిసి సామాజికవర్గం ఎక్కువగా ఉందని.. వారు అభివృద్ది చెందటం.. చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకు మింగుడు పడటం లేదని మాజీ మంత్రి ధర్మానతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయ విమర్శలు చేసి.. రాజకీయ లబ్ది పొందేందుకు చేసిన ప్రయత్నాలు.. ఎంత వరకు ఫలించాయో.. లేదో.. కానీ ఆంధ్ర యూనివర్శిటీకి శాశ్వత వైస్‍ఛాన్స్లర్‍ను, వెనుకబడిన వర్గాల వారిని నియమించటంలో… మాజీ మంత్రి ధర్మానతో పాటు ఇతర మంత్రులు, అధికార ప్రజా ప్రతినిధులు ఏ కారణాలతో శ్రద్ద చూపటం లేదు.

ఇంఛార్జి విసిగా ప్రసాద్‍రెడ్డి ఏడాది నుండి కొనసాగుతున్నా.. బిసి వైస్‍ ఛాన్స్లర్‍ను నియమించాలని.. బిసి మంత్రులు, బిసి ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రభుత్వాన్ని కోరలేదు. పూర్తి స్థాయి బిసి నియామకం పై రెండో సారి నియమించిన సెర్చ్ కమిటీ ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. పూర్తి స్థాయి విసి పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలోనే గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చింది. కంప్యూటర్‍ సైన్స్ విభాగానికి చెందిన ప్రసాద్‍రెడ్డిని ఇంఛార్జి విసిగా నియమించటమే నిబందనలకు విరుద్దం. ఒక దశలో ఇంఛార్జి విసిగా ఐఐటి మరియు సెంట్రల్‍ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్లను నియమిస్తారని ప్రసారం జరిగినా.. విసి నియామకం జరగలేదు. ఏయూ విసి నియామకానికి సంబందించి గత ఏడాది ఆగష్టులో నోటిఫికేషన్‍ ఇవ్వటంతో పాటు సెర్చ్ కమిటిని కూడా ప్రభుత్వం నియమించింది. ముగ్గురు పేర్లతో కూడిన నివేదికను సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి అందించింది. జాబితాలో పేరున్న ఒక సీనియర్‍ ప్రొఫెసర్‍ నియమితులవుతున్నట్లు ప్రసారం జరిగింది.

హఠాత్తుగా సెర్చ్ కమిటీని నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020 జనవరిలో మరో సారి నోటిఫికేషన్‍ విడుదల చేస్తూ.. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రొఫెసర్లే కాదు.. కొత్త వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ.. మరో సెర్చ్ కమిటీని మార్చి నెలలో ప్రభుత్వం నియమించింది. మొదటి సారి నియమించిన కమిటీని ఎందుకు రద్దు చేశారు.. రెండో సారి మరో కమిటీని ఎందుకు నియమించారు అనే విషయంపై ఆరా తీయగా.. మొదటి సారి సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన వారిలో అధికార పార్టీ వారు ఇష్టపడే ప్రొఫెసర్లు లేకపోవటంతో.. కొంతమంది మ ంత్రులు కమిటీని రద్దు చేయించారని ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. మార్చిలో నియమించిన సెర్చ్ కమిటి కోవిడ్‍-19 నేపధ్యంలో ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించలేదు. ఎప్పటి వరకు ఇంఛార్జి విసిగా ప్రసాద్‍రెడ్డి కొనసాగుతారో.. రహస్యమేనట. ఆంధ్ర యూనివర్శిటికీ విసిగా బిసి సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్లను ఎంపిక చేయించాల్సిన బాధ్యతగల బిసి మంత్రులు, బిసి అధికార ప్రతినిధులు ఎవరూ నోరు విప్పటం లేదని విమర్శలు వస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *