Tue. Sep 22nd, 2020

ఆవేదనలో అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగులు..!

employees

employees

తాను అధికారంలోకి వస్తే.. అవుట్‍ సోర్సింగ్‍, కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తానని పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సమయంలో.. హామీ ఇవ్వటమే కాకుండా ఎన్నికల ప్రమాణికలో కూడా పొందుపరిచిన సిఎం జగన్‍ అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. వారి జీతాలను కూడా ఇంత వరకు పెంచలేదు. ఇంకేముంది జగన్‍ ముఖ్యమంత్రి అయ్యారు. మన ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తారు అని ఆశపడ్డ అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగులకు జగన్‍ నిరాశే మిగిల్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయింది. కనీసం అవుట్‍ సోర్సింగ్‍ జీతాలు అన్నా రెట్టింపు చేస్తారని భావించినప్పటికీ అవి కూడా అమలుకు నోచుకోలేదు. మా ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తారని నమ్మి.. ఎన్నికలలో జగన్‍ పార్టీకి ఓటు వేశాం. అధికారంలోకి వచ్చాక మమ్ములను ఉద్యోగాల నుండి తొలగించాలని భావించారు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయిన నేపధ్యంలో ఆప్రతిపాదనను విరమించుకున్నారు.

మా జీత భత్యాలను పెంచితే సంతోషించేవారం. కానీ ముఖ్యమంత్రికి మాపై దయ కలుగటం లేదని అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగులు ఆవేదనతో చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుట్‍ సోర్సింగ్‍ మరియు ఉద్యోగ సంఘ నాయకులుగా చెలామణి అయిన వారు అప్పట్లో వారానికి మూడు సార్లు ఏదో ఒక ప్రకటన చేస్తూ.. మా ఉద్యోగుల జీతాలు పెంచాలి.. క్రమబద్దీకరించాలి.. లేకుంటే నిరసన ప్రదర్శనలు చేస్తాం.. ధర్నాలు చేస్తాం.. అని బెదిరింపులు చేసిన ప్రబుద్దులు సిఎంగా జగన్‍ బాధ్యతలు స్వీకరించాక ఇంత వరకు ఆవిధమైన ప్రకటన చేయలేదు. ఉద్యోగుల జీత భత్యాలు పెంచాలని అడగలేదు. చంద్రబాబును పరోక్షంగా బెదిరించిన ఉద్యోగ సంఘాల నాయకులకు జగన్‍ను బెదిరించేందుకు ధైర్యం చాలటం లేదేమో.లేదా మా ఉద్యోగాలు ఊడతాయి అన్న భయాందోళనలు ఉన్నాయేమో. వాస్తవానికి అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగుల జీత భత్యాలు పెంచేందుకు ఎన్నికల ముందు ఉత్తర్వులు జారీచేసినా.. ఎన్నికల కోడ్‍ అమల్లోకి వచ్చిన నేపధ్యంలో ఆ జీవో అమలు కాలేదు.

ఎన్నికలకు ఆరు నెలల ముందే వారి జీతాలను రెట్టింపు చేసినట్లయితే.. ఎన్నికలలో చంద్రబాబుపై అంత వ్యతిరేకత ఆ ఉద్యోగులలో వచ్చేది కాదు. తాజాగా సిఎం సమీక్షలు, సమావేశాలు నిర్వహించినా.. అవుట్‍ సోర్సింగ్‍, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల వలె జీతాలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారే తప్ప.. ఆ ఉద్యోగాలను క్రమబద్దీ కరిస్తామనికానీ… జీతాలు రెట్టింపు చేస్తామని కానీ చెప్పలేదు.చంద్రబాబుపై విమర్శలు,ఆరోపణలు చేసినా.. ఆయన పట్టించుకోరు. జగన్‍పై విమర్శలు, ఆరోపణలు చేస్తే.. ఆయన వారి బరతం పడతారని.. భయాందోళనలు ఉన్నాయట. అసలు వారికే అంత భయం ఉంటే.. అవుట్‍ సోర్సింగ్‍, కాంట్రాక్టు ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు భయపడరని కొందరు ఉద్యోగులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *