Tue. Sep 22nd, 2020

జగన్‍ సర్కార్‍కు మళ్లీ కోర్టు మొట్టికాయలు

ap high court, nimmagadda

ap high court, nimmagadda

స్థానిక సంస్థల ఎన్నికల మాజీ కమీషనర్‍ నిమ్మగడ్డ రమేష్‍కుమార్‍ దాఖలు చేసిన కోర్టు దిక్కారణ పిటిషన్‍పై శుక్రవారం నాడు న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా.. వెంటనే గవర్నర్‍ను కలిసి కోర్టు ఉత్తర్వులు అమలు చేయవలసిందిగా కోరమని నిమ్మగడ్డను కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కమీషనర్‍ను నియమించే అవకాశం గవర్నర్‍కు ఉందని చెప్పామని.. సుప్రీం కోర్టులో మూడు దపాలు విచారణ జరిగినా.. స్టే ఇవ్వలేదని.. నిమ్మగడ్డ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. స్టే ఇవ్వలేదు కాబట్టి.. తాము ఇచ్చిన తీర్పు అమలులో ఉన్నట్లు తాజాగా హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధర్మాసనం తీర్పును అమలు జరపాల్సిందే అని గవర్నర్‍ను నిమ్మగడ్డ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయాలని న్యాయస్థానం నిమ్మగడ్డకు సూచించింది.

అనంతరం వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తూ.. ఈ లోపే ప్రభుత్వం కౌంటర్‍ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. రేపో.. మాపో.. నిమ్మగడ్డ గవర్నర్‍ను స్వయంగా కలిసేందుకు అనుమతి తీసుకుని కోర్టు ఉత్తర్వులు అందజేయవచ్చు. మళ్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‍ దాఖలు చేస్తుందా.. హైకోర్టు తీర్పునే అమలు చేయాలని గవర్నర్‍కు సిఫార్సు చేస్తుందా.. రెండు మూడు రోజులు గడిస్తే కానీ అసలు విషయం బయట పడదు. నిమ్మగడ్డ వ్యవహారంలో గోటితో పోయే దానిని కొండంతగా చేసుకున్న పాలకులు కోర్టు తీర్పుపై న్యాయ కోవిదుల సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకు వెళతారో.. వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *