Mon. Aug 10th, 2020

ప్రభుత్వ కార్యాలయాలకు.. కరోనా ఎఫెక్ట్

govt office

govt office

నిన్న మొన్నటి వరకు రాష్ట్ర సచివాలయం, కొన్ని హెచ్‍వోడీ కార్యాలయ ఉద్యోగులను.. వారి ఇష్టానికి వ్యతిరేకంగా.. వరించిన కరోనా వ్యాది వైరస్‍ జిల్లాలోని కలెక్టర్‍ కార్యాలయాలకు, ఇతర జిల్లాల అధికారుల కార్యాలయాలకు, రెవిన్యూ, మండల కార్యాలయాలకు పాకిపోతుంది. కొన్ని జిల్లాల కలెక్టర్‍ కార్యాలయాలలో కరోనా కలకలం రేపింది. కొందరు ఉద్యోగులు అనార్యోగం పాలవటంతో వారికి కోవిడ్‍ పరీక్షలు నిర్వహించగా.. కరోనా వ్యాది సోకినట్లు బయట పడటంతో.. కలెక్టర్లు…ఇతర కార్యాలయ అదికారులు భయాందోళనలకు గురవుతున్నారు. కలెక్టర్‍ కార్యాలయ అన్ని విభాగాలలో శానిటేషన్‍ చేయిస్తున్నారు. జిల్లాల మొత్తం పాలన నడిపించే కలెక్టర్‍ కార్యాలయాలలో ప్రతి రోజూ కలెక్టర్‍, జాయింట్‍ కలెక్టర్‍ అనేక సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. అప్పుడప్పుడు మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ సమావేశాలకు వస్తుంటారు.

అంతే కాకుండా జిల్లాల నలు మూలల నుండి తమ సమస్యల దరఖాస్తులు ఇవ్వటానికి వస్తుంటారు. అసలు విషయం ఏమిటంటే.. కోవిడ్‍-19 అదుపునకు సంబందించిన వైద్య నిపుణులతో కూడిన కమిటీలు కలెక్టర్‍ కార్యాలయంలో పనిచేస్తుంటారు. కలెక్టర్‍ కార్యాలయంలోకి వచ్చేవారందరికీ ధర్మల్‍ స్క్రీనింగ్‍ నిర్వహించి, శానిటేషన్‍ చేస్తున్నప్పటికీ.. కరోనా బయట పడటంతో.. ఉద్యోగులు ఉలిక్కిపడుతున్నారు. ఆందోళనతో కనిపిస్తున్నారు. విధులు నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని.. సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించాలని కోరుతున్నా.. వారు పట్టించుకోలేదు. వారు చేసిన తప్పులకు మేం బలవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరికే కరోనా బయట పడిన నేపధ్యంలో మిగతా వారు ఇంటి దగ్గర నుండి పనిచేస్తామని చెబుతున్నా.. అది అమలుకు నోచుకోవటంలేదు. కలెక్టర్‍ కార్యాలయంలో జరిగిన సమావేశాలకు వచ్చిన కొందరు ప్రజా ప్రతినిధులకు, మంత్రుల ఆంతరంగిలకు, గన్‍మెన్‍లకు కూడా కరోనా బయట పడింది. ఈనేపధ్యంలో కలెక్టర్లు కఠినంగా వ్యవహరించకుంటే.. పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *