Sat. Oct 24th, 2020

డిప్యూటీ సిఎంగా తమ్మినేని..?

Tammineni Seetharam

Tammineni Seetharam

శాసనసభాపతి తమ్మినేని సీతారాంను డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు హోంశాఖకు మంత్రిగా నియమించాలని ముఖ్యమంత్రి జగన్‍ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శాసనసభాపతిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. శాసనసభలో, బయట కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుత హోం మంత్రి సుచరిత డిప్యూటి ముఖ్యమంత్రిపిల్లి సుభాష్‍చంద్రబోస్‍ల కన్నా.. తమ్మినేని చాలా నయం అని జగన్‍ భావిస్తున్నట్లు సమాచారం. జగన్‍ బలహీనతలు శాసనసభాపతి తమ్మినేనికి తెలుసు. ఆబలహీనతను అనుకూలంగా మలుచుకుని అధికార పూర్వకంగా మరింత ఎత్తు ఎదగాలని తమ్మినేని ఆశపడుతున్నట్లు తెలిసింది. చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు ఎవరెవరు చేసినా.. శాసనసభాపతి హోదాలో మంత్రులుకన్నా.. అధికార ప్రజా ప్రతినిధులు కన్నా.,.. పార్టీ నాయకులు కన్నా.. తమ్మినేని మిన్నా అని జగన్‍ ఒక అభిప్రాయానికి వచ్చిన వారట. తమ్మినేని కూడా బిసి సామాజికవర్గానికి చెందిన వారే. ఈ నేపధ్యంలో శాసనసభాపతి పదవిని మరొకరికి ఇచ్చి తమ్మినేనిని డిప్యూటి ముఖ్యమంత్రి మరియు హోం మంత్రిగా నియమిస్తే.. సీతారాం తన సత్తా చాటుతారని జగన్‍ నమ్ముతున్నారట.

శాసనసభా పతి హోదాలో ఉంటూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తమ్మినేని చేసిన విమర్శలు, ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నేను శాసనసభలోనే సభాపతిని. బయటకు వస్తే.. జగన్‍ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను.. ఆ పార్టీ కార్యకర్తను అని తమ్మినేని చెప్పేవారు. తనకు తమ్మినేనిలో ఆ లక్షణాలు బయట పడినప్పుడు సిఎం జగన్‍ ఎంతో ప్రశంసించేవారట. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా… తమ్మినేనికి డిప్యూటి ముఖ్యమంత్రితో పాటు హోం శాఖను కేటాయిస్తే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, టిడిపి నేతలను, ఆ పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు,మాజీ మంత్రులను అన్ని ఇబ్బందులు పెడతారని.. అప్పుడు తాను తెరపైకి రానక్కర్లేదని జగన్‍ అనుకుంటున్నారట. శాసనసభాపతి పదవిలో ఉంటూ.. నా పదవి శాసనసభకే పరిమితం.. మిగతా ప్రదేశాలలో జగన్‍ పార్టీ ఎమ్మెల్యేను.. జగన్‍కు వీర విధేయుడును అని తమ్మినేని వెల్లడించటం మేధావి వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు ఎందరెందరో శాసనసభాపతులుగా బాధ్యతలు నిర్వహించారు. వారిలో యనమల రామకృష్ణుడు మాత్రమే క్రీయాశీలక రాజకీయాల్లో తిరిగి కొనసాగుతున్నారు. శాసనసభాపతి పదవిలో ఉంటే.. మాజీ స్పీకర్లకు ఎదురైన రాజకీయ పరిస్థితులు తనకు ఎదురుకాకుండా ఉండాలని తమ్మినేని కోరుకుంటున్నారట. తమ్మినేనికి డిప్యూటి ముఖ్యమంత్రి పదవితో పాటు హోమంత్రి కూడా బిసి కోటాలో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జగన్‍ పార్టీకి చెందిన సీనియర్‍ నేతలు తెర వెనుక చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *