Sat. Sep 19th, 2020

కరోనా రిపోర్టుల వెల్లడిలో టెన్షన్లు..!

corona test

corona test

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు పరీక్ష చేయించువాలంటే… రెండు రోజులు తప్పనిసరిగా వేచి చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక సారి నమూనాలు తీసుకున్నాక.. ఐదు రోజులు గడిచాక కానీ పరీక్షల రిపోర్టులు బయటకు రావటం లేదు. ఈ లోపు పరీక్షలు చేయించుకున్న వారి ద్వారా ఇతరులకు వైరస్‍ వ్యాపిస్తుందని.. ఆ కారణాలతోనే పాజిటివ్‍ కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. శాంపిల్స్ ఇచ్చిన వారికి జరుగుతున్న జాప్యంతో వైరస్‍సోకిందా లేదా అన్న విషయం తెలీక కొట్టు మిట్టాడుతున్నారు. ఫలితాలలో జరుగుతున్న జాప్యానికి నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష చేయించుకున్న వారు తమకు పాజిటివ్‍ రాదని.. నెగటివ్‍ వస్తుందన్న ధీమాతో యధేచ్చగా బయట తిరుగుతున్నారు.

వివిధ జిల్లాలలో కోవిడ్‍ పరీక్షల రిపోర్టుల వెల్లడిలో జాప్యం జరగటానికి రోజు రోజుకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయటమే అని అధికారులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు 100 కేసులు ఉంటేతాజాగా 500 కేసులు వస్తున్నాయి. వంద రెండు వందల కేసులకు తక్కువ సమయం పట్టేది. 500కేసులకు ఎక్కువ సమయం పడుతుంది కదా.. అందుకే జాప్యం జరుగుతుంది అంటున్నారు అధికారులు. వైరస్‍ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. రిపోర్టులు రావటానికి ఆలస్యం కావటం వలన తమకు వైరస్‍ సోకిందన్న అనుమానంతో చాలా మంది మానసిక క్షోభకు గురవుతున్నారు. పరీక్ష చేయించుకుని ఇళ్లకు వెళ్లిన వారిలో ఎక్కువ మందికి ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆందోళన, బెంగతో భోజనం సహించక.. నిద్ర పట్టక అనారోగ్యం పాలవుతున్నారు. మరి కొంతమందిలో మానసిక ఆందోళన తీవ్రంగా పెరిగి డిప్రెషన్‍లోకి వెళ్లిపోతున్నారు. మరి కొంత మంది ఫలితాలతో సంబందం లేకుండా.. వైరస్‍ బారిన పడము అన్న ధీమాతో బహిరంగంగా తిరిగేస్తున్నారు. పరీక్ష చేయించుకున్న మరు రోజు నుండే పనుల్లోకి వెళ్లటం, వ్యాపారాలు చేసుకోవటం.. ఇతర వ్యాపకాలలో మునిగిపోవటం జరుగుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన రిపోర్టులలో వారిలో కొంతమందికి పాజిటివ్‍నిర్దారణ కావటంతో.. సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారు.

ఎక్కడెక్కడ తిరిగారు అన్న వివరాలు తెలుసుకోవటానికి కోవిడ్‍ సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. కోవిడ్‍ పరీక్షల అనంతరం మొదట్లో 24 గంటల నుండి 48 గం•ల్లో ఫలితాలు వెల్లడించేవారు. దీని వలన వైరస్‍ బారిన పడిన వ్యక్తిని అప్పటి వరకు హోం ఐసోలేష్‍లో ఉండాలని సూచించటం జరిగింది. అయితే తాజాగా నమోదవుతున్న నమూనాలు సంఖ్య పెరుగుతున్న కొద్ది పలితాలలో జాప్యం జరుగుతుంది. కారణాలు ఏమైనప్పటికీ సామర్థ్యానికి మించి నమూనాలు సేకరించటం కంటే.. ఒక రోజులో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉండే విధంగా నమూనాలు సేకరించటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *