Sat. Oct 24th, 2020

కరోనా బాధితులకు హోం క్వారంటైన్‍ అనుమతి

quarantine

quarantine

కరోనా పాజిటివ్‍ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో.. ఇక నుండి ఎవరికైనా పాజిటివ్‍ వచ్చినా.. అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న వారికి హోం క్వారంటైన్‍లో ఉండేందుకు అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖాదిపతితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఈ విషయంలో ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వాస్తవాలు తెలియజేస్తున్నారు. దీంతో ఆ ఇద్దరుచెప్పిన విషయాలు విని ముఖ్యమంత్రి కొత్త పథకాల అమలుకు గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చారు. జిల్లాలలో పాజిటివ్‍ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో భాధితులకు రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఆక్సిజన్‍ స్థాయి సరిగా ఉంటే… అలాంటి వారిని వారి సొంత ఇళ్లలో ఉండే విధంగా అనుమతి ఇవ్వబోతున్నారు. అలాంటి వారందరికీ నిత్యం ప్రతిరోజూ ఈ-కన్సల్టేషన్‍ విధానంతో వైద్యులు సేవలందిస్తారు.

అదే విధంగా ప్రతి రోజూ ఏఎన్‍ఎంలు ఆ రోగులను పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆర్టీసి ఇంద్ర ఏసీ బస్సులను సంచార ల్యాబ్‍లుగా ఉపయోగించుకునే విధంగా అనుమతి ఇవ్వటం జరిగింది. నేడో.. రేపో ఆయా బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వివిధ జిల్లాలలో ఎక్కువ మందికి కోవిడ్‍ పరీక్షలు చేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకొక్క జిల్లాలో రెండు నుండి మూడువేల మంది వరకు అంటే 13 జిల్లాలో 25వేలకు పైగా పరీక్షలు జరగబోతున్నాయి. బిఆర్‍డిఎల్‍ పరీక్షలకు ఆధునిక యంత్ర పరికరాలను కూడా సమకూరుస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ట్రూనాట్‍ పరీక్షలను మరింత పెంచబోతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులకు వెళితే పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *