Sat. Oct 24th, 2020

విశాఖలో కరోనా విజృంభిస్తున్నా.. సిఎం క్యాంపు కార్యాలయం పెడతారా..?

vizag, jagan

vizag, jagan

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఆగష్టు 15వ తేదీ లోపే మార్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు విశాఖ నగరంలో కరోనా వ్యాది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల డిజిపి గౌతమ్‍ సవాంగ్‍ మాట్లాడుతూ విశాఖకు వెళ్లేందుకు తాము సిద్దమే అన్నారు. ఒకవైపు కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తోంది. సిఎం కార్యాలయ అధికారులను, సిఎం నివాసం దగ్గర ఉండే సెక్యురిటీ సిబ్బందిని కూడా కరోనా వదలటం లేదు. అయినా సరే విశాఖ నగరంలో క్యాంపు కార్యాలయం పెట్టాల్సిందే అని ముఖ్యమంత్రి జగన్‍ భావిస్తున్నారా..? లేదా సిఎంవో అధికారులు ఆ విధమైన ప్రచారాన్ని చేయిస్తున్నారా.. అనే విషయాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖలో ఏప్రిల్‍ మే, మాసాలలో కరోనా పాజిటివ్‍ కేసులు అంతంత మాత్రమే బయట పడినా.. జూన్‍, జులైలో కరోనా జాబితా చేంతాడు వలె పెరిగిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్న నేపధ్యంలో సిఎం క్యాంపు కార్యాలయం విశాఖ నగరంలో ఏర్పాటు చేస్తారని జరుగుతున్న ప్రచారం వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరు అన్న విషయం బయట పడటం లేదు. ముందుగా సిఎం కార్యాల••ం వెళుతుంది. ఆ తరువాత మంత్రుల కార్యాలయాలు, ఆ తరువాత శాఖాదిపతులు కార్యాలయాలను ఏర్పాటు చేసినా ఆధ్యర్యపడక్కర్లేదు. ఈ మధ్యలో కరోనా వ్యాది తీవ్రత తగ్గవచ్చు. ఆ వ్యాది తీవ్రత తగ్గాక సచివాలయాన్ని, హెచ్‍వోడీలను తరలించటం ఖాయం అంటున్నారు ఉద్యోగులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *