Sat. Sep 19th, 2020

కలెక్టర్‍ గారు ఈ ఉత్తర్వులు ఏమిటి..?

chittore

chittore

తిరుపతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ డిపార్టుమెంట్‍లు, ఆర్గనైజేషన్లు, ఇనిస్టిట్యూషన్లలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు కోవిడ్‍-19పై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమీక్షలు, సమావేశాలలో పాల్గొనాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‍ భరత్‍నారాయణ గుప్తా లిఖిత పూర్వకంగా సూచించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిచుట్టుపక్కల వివిధ శాఖలలో పనిచేసే అధికారులందూ కోవిడ్‍-19 విషయంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సంప్రదించాలని.. కలెక్టర్‍ సూచించటంలో మర్మం ఏమిటి.?అధికారులు, ఉద్యోగులు కలిసి మెలసి కోవిడ్‍పై ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిన్నటి వరకు నిర్వహించారు. ఆ సమావేశాలలో మంత్రులు, ఇంఛార్జి మంత్రులు పాల్గొనే సంప్రదాయాలున్నాయి. కానీ ఆ సంప్రదాయాలకు భిన్నంగా కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తీసుకు వచ్చారు కలెక్టర్‍ భరత్‍ నారాయణ గుప్తా.

ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమీక్షలు, సమావేశాలు జరగాలని..వారితో అధికారులు చర్చించాలని ఆదేశాలు ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్‍ ఆ విధంగా ఆదేశాలు జారీ చేయటం వివాదాస్పదంగా మారింది. చంద్రగిరి నియోజవర్గ పరిదిలోని అధికారులు, ఉద్యోగులతో ఎమ్మెల్యే సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. కానీ తిరుపతితో పాటు ఆ చుట్టుపక్కల అధికారులు, ఉద్యోగులు చెవిరెడ్డి నిర్వహించే సమీక్షలకు ఎందుకు హాజరు కావాలి. కాళహస్తి, నగిరి, తిరుపతి ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలెక్టర్‍ ఆదేశాలపై ఇంత వరకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం విశేషం. మా నియోజకవర్గాలలో వివిధ హోదాలలో, వివిధ శాఖలలో పనిచేసే ఉద్యోగులు మేము నిర్వహించే సమీక్షలు, సమావేశాలలో పాల్గొనాలే తప్ప చంద్రగిరి ఎమ్మెల్యే నిర్వహించే సమావేశాలలో మా నియోజకవర్గ అధికారులు ఎందుకు పాల్గొనాలి అని ఎమ్మెల్యేలు ఎవరూ ఇంత వరకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కలెక్టర్‍ ఆదేశాలు ఇంత వరకు ఆయా ఎమ్మెల్యేలకు తెలియకపోవచ్చు.

ఒక వేళ తెలిసినా… మనకు ఎందుకు ఈ తలనొప్పి.. ఆ తలనొప్పి ఏదో చెవిరెడ్డే పడతారులే అని తేలికగా తీసుకున్నారేమో. అధికారులు, ఉద్యోగులతో నిర్వహించాల్సిన సమావేశాలను.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో నిర్వహించే కొత్త సంప్రదాయానికి కలెక్టర్‍ భరత్‍ నారాయణ గుప్తా తెరదీశారు. పై నుండి వత్తిళ్లు వచ్చాయా.. లేక కలెక్టర్‍ గారే స్వయంగా ఆ నిర్ణయం తీసుకున్నారా. ఆ నిర్ణయం తీసుకునే ముందు కాళహస్తి, నగిరి, తిరుపతి ఎమ్మెల్యేలతో కలెక్టర్‍ సంప్రదించారా అనే విషయాలు బయట పడటం లేదు. కలెక్టర్‍ ఆదేశాలపై ఎమ్మెల్యేలు భగ్గుమంటారా.. సర్దుకుపోతారా.. మనకెందుకులే అని తేలికగా తీసుకుంటారా.? అనేది వేచి చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *