Mon. Apr 6th, 2020

అమెరికాలోనూ మిన్నంటిన అమరావతి సెగలు

Andhra Pradesh, Amaravati,America, NRI

అమరావతి రైతులకు ప్రవాసాంధ్రుల మద్దతు
సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సమావేశాలు
వివిధ నగరాల్లో సమావేశాలు
అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ఆందోళనలు అమెరికాకూ తాకాయి. రాజధాని రైతులకు మద్దతుగా అమెరికాలోని వివిధ నగరాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందేనని, అయితే అధికార వికేంద్రీకరణ మాత్రం తగదని నినదిస్తున్నారు. అంతేకాదు, వాషింగ్టన్ డీసీ, డెలావేర్, పెన్సిల్వేనియా, చికాగో, ఆస్టిన్, న్యూజెర్సీ, డెమోయిన్స్ తదితర నగరాల్లో సమావేశాలు నిర్వహిస్తూ అమరావతిపై గళమెత్తుతున్నారు. నేడు, రేపు కూడా పలు నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రవాసాంధ్రులు తెలిపారు. ఏయే నగరాల్లో ఎప్పుడు సమావేశాలు నిర్వహించేదీ కార్యాచరణ ప్రకటించారు.
Tags: Andhra Pradesh, Amaravati,America, NRI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *