Wed. Oct 21st, 2020

అమరావతి తరలింపుపై మంత్రి వర్గంలో చర్చ..?

amaravathi, cabinate

amaravathi, cabinate

త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఎంత త్వరగా సచివాలయం, హెచ్‍వోడీలను తరలిస్తే.. అంత మంచిదని మంత్రులు కొందరు పట్టుబట్టే అవకాశం ఉందట. సిఎం సూచనలతో మంత్రి వర్గ సమావేశంలో కొందరు మంత్రులు మాట్లాడేందుకు సిద్దమవుతున్నారా.? లేక వారు తమ అభిప్రాయాలను తెలియజేయబోతున్నారా అనే విషయం తెలియటం లేదు. మంత్రి వర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై ఒక తేదీని నిర్ణయించే అవకాశం ఉందని.. మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు… మేమంతా కరోనా వైరస్‍పై దృష్టి పెట్టామంటున్నారు విశాఖ జిల్లాకు చెందిన అధికారులు. కానీ సిఎంవో అధికారి ఒకరు మాత్రమే విశాఖ నగరానికి, ఆ పక్కన ఉన్న ప్రాంతానికి వెళ్లి సిఎం క్యాంపు కార్యాలయానికి భవనాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

అయినప్పటికీ రాజధానిని విశాఖ నగరానికి తరలించాలని ఆలోచిస్తున్నారా..? లేదా ఎవరైనా ఈ విషయాన్ని ప్రచారం చేయిస్తున్నారా..? ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు కూడా కరోనా విషయంలో ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగరంలో కొంత మంది క్రింది స్థాయి పోలీసు అధికారులకు కూడా కరోనా సోకినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో రాజధాని తరలింపుపై మంత్రి వర్గంలో చర్చ జరిగితే..మేధావులు, రాజకీయ విశ్లేషకులు పాలకుల తీరును దుయ్యబట్టడం ఖాయం. కరోనా వైరస్‍ బాధితులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయటం ఖాయమంటున్నారు అధికార పక్ష నాయకులు. అటు సోషల్‍ మీడియాలో కానీ.. ఇటు ఇతర మీడియాలో కానీ.. రాజధాని తరలింపుపై ప్రచారం జరుగుతోంది.దీనిపై కొన్ని టివి ఛానెళ్లు చర్చా కార్యక్రమం కూడా చేపట్టాయి. కానీ పాలకుల మనసులో ఏముందో.. మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తారా లేదా అనే విషయం బయట పడటం లేదు. ఏదైనా రాజధాని తరలింపుకు ముహుర్తం నిర్ణయించటం జరిగిందని.. దానిని వెల్లడించేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని విపక్షాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పరిపాలన రాజధానికి విశాఖ జిల్లాలో కాకులుప్పాడ కేంద్ర బిందువు కానుందని మంత్రి అవంతి శ్రీనివాస్‍ చెబుతున్నారు. చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. విశాఖ రాజధాని కాకుండా ఆపలేరన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం కాబోతుందన్నారు. విశాఖనగరానికిచెందిన మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఎక్కడో ఏదో జరుగుతుందన్న అనుమానం వ్యక్తం అవుతందంటున్నారు విపక్షాల నేతలు. పరిపాలన రాజధానిని విశాఖకు ఎప్పుడు, ఎలా తరలిస్తారు అనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారిలో ఏ ఒక్కరూ నోరు విప్పటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *