Sat. Oct 24th, 2020

రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అజయ్‍ కల్లం..?

ajay kallam

ajay kallam

ముఖ్యమంత్రి సలహాదారు హోదాలో.. కొన్ని శాఖల ఫైళ్లను పర్యవేక్షిస్తున్న అజయ్‍ కల్లం నుండి ఆయా శాఖలను ముఖ్యమంత్రి తప్పించిన విషయం విధితమే. అపార అధికార అనుభవం ఉన్న అజయ్‍కల్లం నుండి ఆయన పర్యవేక్షిస్తున్న శాఖలను తప్పించటం అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ముఖ్యమంత్రి మనసులో ఏదో కారణం ఉండి ఉంటుందని.. అది రేపో మాపో ఆయన ఏదో రూపేణా బయట పెడతారని.. అధికారులు భావిస్తున్నారు. రాజకీయంగా, అధికారంగా దూరం పెట్టిన విజయసాయిరెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పోస్టు నుండి తప్పించి ఆ పోస్టులో అజయ్‍ కల్లంను నియమించాలని జగన్‍ భావిస్తున్నట్లు బయటకు పొక్కింది.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి అంటే.. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఎప్పటి కప్పుడు కలుస్తూ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయింపు ఇతర విషయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటే… అధికార అనుభవం ఉన్న ఐఎఎస్‍ అధికారి సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని జగన్‍ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే అజయ్‍ కల్లం నుండి ఆయన పర్యవేక్షిస్తున్న శాఖలను తప్పించి ఢిల్లీలో నియమించాలని జగన్‍ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 30ఏళ్ల పాటు ఐఎఎస్‍ అధికారిగా అనుభవం ఉన్న అజయ్‍ కల్లం సేవలను ఢిల్లీలో ఉపయోగించుకోవాలని జగన్‍ నిర్ణయం తీసుకున్నారట.

అధికార ప్రతినిధిగా ఉన్న విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్న జగన్‍ ఆ పదవి నుండి తప్పించి అజయ్‍ కల్లంను నియమిస్తే.. ఆయన ఢిల్లీలో చాలా పరిస్థితులు చక్కపెడతారని జగన్‍కు నమ్మకమట. అంతే కాకుండా ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టిన చందంగా.. విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ప్రభుత్వ అధికార పదవి నుండి తప్పించవచ్చు. సిఎంవో నుండి అజయ్‍ కల్లంను తప్పించవచ్చు.ఈ నేపధ్యంలో అజయ్‍ కల్లంను రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో నియమించే ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *