Fri. Apr 3rd, 2020

మోదీ, అమిత్ షాలకు టీడీపీ ఎంపీ కనకమేడల లేఖ

kanakamedala ravindra kumar,modi,amit shah

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. 13 జిల్లాలు ఉన్న ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులు అంగీకరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చూడాలంటూ ఆ లేఖలో విన్నవించారు.

విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఖరారైందని, తన పరిధిలో లేని అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని, మూడు రాజధానుల ప్రతిపాదనను కనుక అడ్డుకోకపోతే దేశంపైనే దుష్ప్రభావం పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. టీడీపీ తొలి నుంచి అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు పలుకుతోందని వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా శాసనమండలి రద్దు అంశం గురించీ తన లేఖలో కనకమేడల ప్రస్తావించారు. తన నిర్ణయాలకు శాసనమండలి మద్దతుగా లేదని భావించడం వల్లే దీని రద్దుకు బిల్లు పెట్టారని, ఈ విషయంలో రాష్ట్రాలు తమ ఇష్టానుసారం వ్యవహరించడం సబబు కాదని అన్నారు. మండలి రద్దుపై ముందుకు వెళ్లే ముందు పరిస్థితులను సమీక్షించాలని ఆ లేఖలో కనకమేడల కోరారు.
Tags: kanakamedala ravindra kumar,modi,amit shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *