Sat. Oct 24th, 2020

భక్తులకు శ్రీవారి దర్శనాలు కల్పించటంలో…

tirumala

tirumala

రోజుకు 50 వేల నుండి లక్ష మంది వరకు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి. శెలవు రోజులలో రద్ది ఎక్కువగా ఉండేది. సాధారణ రోజులలో కనీసం 40 నుండి 50వేల మంది శ్రీవారిని దర్శించుకునేవారు, సుదీర్ఘ విరామం తరువాత ప్రారంభైన శ్రీవారి దర్శనం.. నాలుగు రోజులలో శ్రీవారిని కేవలం 27వేల మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కోటి 30లక్షలు మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ రోజుకు హుండీ ఆదాయం 3 కోట్లు. గతంలో రోజుకు 50వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకునే పరిస్థితులు తారు మారు అయ్యాయి. దీనంతటికి కరోనా వ్యాది కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ… తిరుమల కొండపై కరోనా లేకున్ననూ అధికారులు నిర్లక్ష్యంతో శ్రీవారి దర్శనాలకు ఎప్పుడో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. అధికారులు  ఎక్కువ సమయం తీసుకున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

ట్రయల్‍రన్‍ పూర్తయ్యాక జూన్‍ 11వ తేదీ నుండి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. రోజుకు పది నుండి 20 వేల మంది పైగా భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కలుగజేయవచ్చు. కానీ రోజుకు ఏడువేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వీరిలో 300రూ.ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారు కూడా ఉన్నారు. భక్తులందరూ భౌతిక దూరం పాటిస్తూ… భక్తి శ్రద్దలతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టిటిడి సిబ్బంది ఎలాంటి హడావిడి చేయకుండా అప్రమత్తంగా ఉన్నారు. తిరుమల కొండపై కరోనా వైరస్‍ అనేది ఇంత వరకు కనిపించలేదు. అధికారుల అత్యంత ఉత్సాహంతో శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతించకుండా కాలయాపన చేశారు. తిరుమలలో ఎలాంటి పరిస్థితులున్నప్పటికీ… నిబందనల ప్రకారం భక్తులు భౌతిక దూరం పాటిస్తూనే 20వేల మంది భక్తులకు దర్శనం చేయించవచ్చునని రిటైర్డు టిటిడి అధికారులు చెబుతున్నారు.

టిటిడి ఛైర్మన్‍ కార్యాలయ సిఫార్సులు, అదనపు ఈవో సిఫార్సులతోనే ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారట. ఇప్పటి వరకు శ్రీవారికి వచ్చే వందల కోట్ల ఆదాయం కోల్పోవటం జరిగింది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునే మార్గాలు కనిపెట్ట గలిగితే భక్తుల కోరిక తీరుతుంది.. దేవాలయానికి ఆదాయం వస్తుంది.. అధికారులకు, సిబ్బందికి ఎక్కువ పనిచేసే అవకాశం లభిస్తుంది. వీటన్నింటిపై దృష్టి సారించకుండా… టిటిడి పాలకమండలితో పాటు టిటిడి ఈవోలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ తమపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్న అనుమానాలతో ఆ విషయాలపై దృష్టి పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. లాక్‍డౌన్‍ సమయంలో అటు పాలక మండలి సభ్యులతో పాటు ఇరత ముఖ్యలు మాత్రమే నిబందనలకు విరుద్దంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని టిటిడి ఛైర్మన్‍తో పాటు అదనపు ఈవో కూడా ఖండించినప్పటికీ అసలు విషయం బయట పడాలంటే ఆదారాలు కావాలి.. అలాంటి ఆధారాలు లాక్‍డౌన్‍ పుణ్యమా అంటా కనిపించవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *